India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి ముందే జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కాగా, మూడు రోజుల్లోనే పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పెరిగాయి. మరోవైపు గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా న్యూ టౌన్లో జరిగింది. స్థానికుల వివరాలు.. నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) పట్టణంలోని మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నారు. గురువారం బైక్‌పై వెళుతున్న ఇద్దరూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉరేసుకొని వ్యక్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపోడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్(18) డీజె సిస్టం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మహిళా అభ్యర్థిగా మాజీ సర్పంచ్ అర్వ స్వాతి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిడమనూరు మండలం వేం పహాడ్ గ్రామ మాజీ సర్పంచ్‌గా ఆమె పని చేశారు. కాగా గతంలో ఉత్తమ గ్రామ అవార్డు పొందారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు.
నల్గొండ సమీపంలోని రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలతోపాటు పేద ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె రాములబండ తండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను, సౌకర్యాలను పరిశీలించారు.
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్‌కల్‌లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.
చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీరముష్టి వంశీయులు మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యాసంగి కాలానికి సంబంధించిన రైతు భరోసా నిధులను గత నెల 27వ తేదీన కొంతమంది రైతులకు విడుదల చేసింది. సీఎం ఆదేశాల ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత నెల 27వ తేదీ నుంచి బుధవారం వరకు 1,55,232 మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
Sorry, no posts matched your criteria.