India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూదాన్ పోచంపల్లి మండలంలోని SRTRIలో వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ PSSR లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ, భోజన వసతితో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జనవరి 2 లోపు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు తహతహలాడుతున్నారు. పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌ల పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. కాగా జిల్లాస్థాయి హోదాలైన గ్రంథాలయ సంస్థ, వైడీటీఏ, పలు కార్పొరేషన్ల పదవులు ఆశిస్తున్నారు. దీనికోసం అగ్ర నేతలను తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేశామని, తమకే పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.
చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో BNGR కలెక్టర్ హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్ 7వ కేంద్రం అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.
పేదల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురానుంది. సంక్రాంతికి కొత్తగా తెల్ల రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మందికిపైగా కొత్త రేషన్ కార్డులతో పాటు తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పద్మశ్రీ శ్యామ్ బెనగల్(90)కు యాదాద్రి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985లో పారిశ్రామికీకరణతో చేనేత, చేతివృత్తులు ఎలా మసకబారిపోతున్నాయో తెలిపేందుకు ఆయన హిందీలో ‘సుస్మన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో 40 రోజులపాటు చిత్రీకరించారు. ఆ సినిమాలో ప్రముఖ నటుడు ఓంపురి, నటి షబానా అజ్మీ నటించారు.
NLG ప్రాంతానికి చెందిన సహాయ ఆచార్యులు/ లెక్చరర్స్/ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులకు తెలుగులో పరీక్ష మూల్యాంకనం, ప్రశ్నారచన పై ఆరు రోజుల శిక్షణ శిబిరం (జనవరి 6 నుంచి 11వ వరకు) నిర్వహించబడుతుందని ఎంజీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ఈనెల 31 వరకు తమ పేరును సంబంధిత వెబ్సైట్లో ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేయాలన్నారు.
MGU ప్లేస్మెంట్ సెల్ & డాక్టర్ రెడ్డి లేబరేటరి, హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్లేసెమెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ హెచ్ ఆర్ డా. మోహన్ రావు సూచనల మేరకు ఇంటర్మీడియట్ & డిగ్రీ పాస్ అయిన అమ్మాయిలకు అద్భుత అవకాశాలు ఇచ్చారు. మొత్తం 100 మందికి గాను 42 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్లేసెమెంట్ డైరెక్టర్ డా.వై ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.