India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల వేళ ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల లెక్కలు మారాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా జనరల్ మహిళా స్థానాలు 5 నుంచి 7కు పెరగడం విశేషం. అయితే, బీసీ మహిళలకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో 3 స్థానాలుండగా ఈసారి వాటిని 2కే పరిమితం చేశారు. ఇక SC మహిళలకు గతంలో లాగే ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ మార్పులు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన సర్పంచ్‌లు శిక్షణను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మొల్కపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామస్థులు సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. మొదట అధికారులు సర్వే చేసి తాము అర్హులమని చెప్పారని, తీరా ఇళ్లు నిర్మించుకునే సమయానికి అనర్హులంటూ జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు.

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు TOMCOM మంచి అవకాశం కల్పిస్తోంది. ఖతార్‌లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజినీర్, HSE ఆఫీసర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.పద్మ తెలిపారు. 25-35 ఏళ్ల వయస్సు ఉండి, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర వసతులు ఉంటాయని చెప్పారు.

నల్గొండ జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరువయ్యాయి. డబ్బులు వసూలు చేస్తున్న యజమానులు కనీస సౌకర్యాలను విస్మరిస్తున్నారు. ఉచిత గాలి, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలన్న రూల్స్ తుంగలో తొక్కుతున్నారు. టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.. లేదంటే తాళాలు వేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కాలం చెల్లినవే. నాణ్యతను ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.

సంక్రాంతి సెలవుల ముగింపుతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం జిల్లా పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 450 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచామని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని కోరారు.

NLG కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో అధికార పార్టీతో పాటు అటు BRS, ఇటు BJPలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 33వ వార్డు నుంచి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, BRS మాజీ ఛైర్మన్ సైదిరెడ్డి ఆయన భార్యను పోటీలో నిలుపుతుండగా, BJP నుంచి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.