India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 4 లక్షల 24వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. మరో లక్ష ఎకరాలకు సరిపడా వరి నార్లు సిద్ధం చేసుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 6,57,000 ఎకరాల్లో వరి తదితర పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్లో రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు ఎక్కువగా వెదజల్లే పద్ధతిని పాటించారు.

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని చిట్యాలలో ఆరు, గట్టుపల్ లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 11 రిజిస్ట్రేషన్లలో సుమారు నాలుగు లక్షల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించినట్లు సమాచారం.

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరులో కమ్యూనిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా, ఫలితాల తర్వాత ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కదని వామపక్షాలు ధీమాగా ఉన్నాయి. బలాబలాల లెక్కల్లో తమదే కీలక పాత్ర అని కమ్యూనిస్టు నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని ప్రతి పల్లెకూ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా ‘ప్రత్యేక డ్రైవ్’ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వహించే 5 నెలల ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు కరపత్రాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. 2025-26 సంవత్సరానికి గానూ బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.