Nalgonda

News January 23, 2026

NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్‌

image

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్‌ కిట్లను పంపిణీ చేసారు.

News January 23, 2026

నల్గొండ : M.B.A , M.C.A ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల..

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ,ఎంసీఏ సెమిస్టర్-1 రెగ్యులర్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 23 మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

News January 22, 2026

నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News January 22, 2026

NLG: బాలికల హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

జిల్లా కేంద్రంలోని SC బాలికల హాస్టల్, పాత బాలికల డి-హాస్టల్‌ను కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులు, భోజనం మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హాస్టల్‌లో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

చెరువుగట్టులో కోనేటి స్నానం చేస్తే సకల పాపాలు హరి

image

తెలంగాణలో రెండవ శ్రీశైలంగా పేరు పొందిన చెరువుగట్టు దేవస్థానం జాతరకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువుగట్టు గుట్టపై గల కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో అగ్ని గుండాల ప్రవేశం అత్యంత కీలకం. ‘హరిహర మహాదేవ శంభో శంకర’ అంటూ నినదిస్తూ నిప్పు కణికలపై నడుస్తారు. కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

News January 22, 2026

NLG: పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలి: ఎస్పీ

image

పోలీసుల వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. నల్లగొండలో ‘యాదాద్రి జోన్-5 పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026’ను ఆయన ప్రారంభించారు. మూడు జిల్లాల నుంచి 320 మంది సిబ్బంది 40 విభాగాల్లో ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన 140 మంది క్రీడాకారులు జోన్ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వినోద్, రమేశ్ పాల్గొన్నారు

News January 22, 2026

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: నల్గొండ కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 70 మంది ఆర్వోలు, 68 మంది ఏఆర్వోలను నియమించినట్లు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

News January 22, 2026

చెరువుగట్టు జాతర ఏర్పాట్లు పరిశీలించిన Addl కలెక్టర్

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు జాతర ఏర్పాట్లను స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, తాగునీరు, సీసీ కెమెరాల ఏర్పాటును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

News January 22, 2026

నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

image

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

News January 22, 2026

NLG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కేతెపల్లి మండలంలోని కొర్లపాడు సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం పాదచారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్రంలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కేతపల్లి ఎస్సై (ఫోన్‌: 8712670180)కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.