India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనుముల, డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల(ITI)లకు రా మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ ITI ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు రూ.31,93,200 వ్యయంతో ఈ ముడి సరుకులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు టెండర్ ఫారాలు, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

చెరువుగట్టు జాతరలో భక్తుల రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ వ్యూహాన్ని రచించింది. వెయ్యి మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అత్యాధునిక ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతతో పాత నేరస్థులపై నిఘా ఉంచడంతో పాటు, క్యూలైన్లు, పార్కింగ్ వద్ద ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ-టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయి.

దేవరకొండలోని ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగానికి పార్ట్ టైం (Hourly Basis) పద్ధతిలో మహిళా లెక్చరర్ నియామకానికి అర్హత గల మహిళా అభ్యర్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ తెలిపారు. ఈ నెల 27 లోపు తమ దరఖాస్తు పత్రాలను సమర్పించలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. వివరాలకు సెల్: 9908330585 సంప్రదించాలన్నారు.

నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ శివరాంరెడ్డి పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న భద్రతపై, సౌకర్యాలపై దేవాదాయ అధికారులను కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటు లేకుండా ఉత్సవాలు జరిపించాలని ఆదేశించారు.

నల్గొండ కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధం అవుతోంది. షెడ్యూల్ వచ్చేలోగా అధికారికంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారంలో దిగేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎంతో జతకలిసి ఈ ఎన్నికల్లో తలపడనున్నది. బీజేపీ సైతం నల్గొండ కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్, 8స్లీపర్ కోచ్‌లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Sorry, no posts matched your criteria.