Nalgonda

News January 28, 2026

నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

image

మాడుగులపల్లి మండలం సీత్యతండాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మి తన భర్త రవిని అతికిరాతంగా హతమార్చింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుల విచారణలో లక్ష్మీ నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయింది. అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఈ దారుణం జరగడంతో తండాలో విషాద ఛాయలు అలముకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 28, 2026

మిర్యాలగూడలో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..!

image

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం 93,020 మంది ఓటర్లలో పురుషుల (45,128) కంటే మహిళలే (47,878) అధికంగా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే, ఆ పార్టీయే ఇక్కడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఈ సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

News January 28, 2026

MGUలో ఫార్మసి, లా కాలేజీల మంజూరు

image

నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) అనుబంధంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 3ఏళ్ల LLB (60 సీట్లు), LLM (20 సీట్లు), B.Pharm (60 సీట్లు) ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. అధ్యాపకుల ఔట్సోర్సింగ్ పోస్టుల కోసం రూ.4.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారానా మంగళవారం జీవో జారీ చేశారు.

News January 27, 2026

మున్సిపల్ పోరుకు సిద్ధం కావాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ రాణి కుమిదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.

News January 27, 2026

NLG: మోగిన ఎన్నికల నగారా… రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నల్గొండ కార్పొరేషన్‌లో ఎన్నికల సందడి మెుదలైంది. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నల్గొండ కార్పొరేషన్‌లో మొత్తం 48 డివిజన్లలో 1,42,437 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 73,507 మంది మహిళలు, 68,874 మంది పురుషులు, 56 మంది ఇతరులు ఉన్నారు. మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు.

News January 26, 2026

మదర్ డెయిరీలో ముదిరిన సంక్షోభం

image

నల్గొండ జిల్లాలోని మదర్ డెయిరీలో పాలకవర్గ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు పరాకాష్టకు చేరుకున్నాయి. 15 రోజుల్లోనే ఇద్దరు ఛైర్మన్లు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో మందడి ప్రభాకర్ రెడ్డి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డెయిరీకి ఉన్న ₹28 కోట్ల అప్పు విషయంలో బ్యాంకులు సీరియస్ అయ్యాయి. ఫిబ్రవరి 1 లోగా ₹10 కోట్లు చెల్లించకుంటే డెయిరీని సీజ్ చేస్తామని హెచ్చరించాయి.

News January 26, 2026

నకిరేకల్: ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

image

నకిరేకల్ బైపాస్‌లో‌ని సాయిప్రియ హోటల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల బందోబస్తు ముగించుకొని బైక్‌పై వస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను, రాంగ్ రూట్లో బైక్‌పై వస్తున్న ఇద్దరు బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.

News January 26, 2026

నల్గొండ: నోటిఫికేషన్ ముంగిట అభ్యర్థుల వేట

image

రెండు మూడు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. రిజర్వేషన్ల మార్పులు, ఒక్కో వార్డులో పలువురు ఆశావహులు ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేశారు.

News January 26, 2026

నల్గొండ కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు

image

నల్గొండ కలెక్టరేట్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News January 26, 2026

నల్గొండ: షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్ల కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానంలో తొలిరోజు మూడు బైకులకు డీలర్ పాయింట్ వద్దే నంబర్లు కేటాయించారు. డీలర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగా, ఆర్టీఓ అధికారులు పర్మినెంట్ నంబర్లు జారీ చేశారు. జిల్లాలో రోజుకు సగటున 100 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, తాజా మార్పుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.