India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లా గట్టుప్పల్‌కు చెందిన నల్లవెల్లి వర్షిత ఫిబ్రవరి 1stకి తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మెంటన్ అండర్-19 పోటీలకు ఎంపికైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయిలో ఎంపికవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీఈటీ గణేశ్, ఆర్గనైజర్ జంగయ్య తదితరులు ఉన్నారు.

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు రెండు విడతల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక చిచ్చు రేపుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నిబంధనలు పక్కనపెట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను సంప్రదించకుండానే అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. మంత్రి ఏకచక్రాధిపత్యంపై జిల్లా నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం కేవలం 44 నామినేషన్లు మాత్రమే రాగా, రెండో రోజైన గురువారం ఏకంగా 563 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 607 మంది అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. నామినేషన్లకు నేడే ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలతో తరలివచ్చే అవకాశం ఉంది.

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు ముగుస్తున్నా స్పష్టత లేకపోవడంతో ఆశావహులు బీ-ఫాం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకుని టికెట్లు కేటాయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రారంభమై 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. శాటిలైట్ సర్వే పేరిట సర్కారు జాప్యం చేస్తోంది. జిల్లాలో రైతు భరోసా కోసం సుమారు 2 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పట్లో పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాజకీయ సమీకరణాలకు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అసలైన పోరు అప్పుడే ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన GP ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన అధికార కాంగ్రెస్ అదే ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా చూడాలి. మరోవైపు ప్రతిపక్ష BRS సైతం అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.

జిల్లాలో అపరాల పంటల సాగు ఏటేటా గణనీయంగా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, రైతులు అపరాల సాగుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో జిల్లాలో విస్తృతంగా సాగైన కంది, బొబ్బెర, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాల పంటలు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నాయి. ఐదేళ్ల క్రితం పదివేల ఎకరాలకు పైగా సాగుచేసిన కంది పంట.. ప్రస్తుతం 1700 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు రెండో రోజు గురువారం 562 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48 డివిజన్లకు 157 నామినేషన్లు, మిర్యాలగూడలో 48 వార్డులకు 176, దేవరకొండలో 2 వార్డులకు 89 నామినేషన్లు దాఖలు చేశారు. హాలియాలో 12 వార్డులకు 40, నందికొండలో 12 వార్డులకు 27, చండూరులో 10 వార్డులకు 29, చిట్యాలలో 12 వార్డులకు 44 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

SRPT మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తారు. 48 వార్డులకు 600 దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉంటారని భావించినా, భారీగా అప్లికేషన్లు రావడంతో హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఉత్తమ్, సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసిన తర్వాతే బీ-ఫామ్ అందజేయనున్నారు.
Sorry, no posts matched your criteria.