Nalgonda

News February 1, 2026

ఈ నెల 13 వరకు ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13వ తేదీ వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News February 1, 2026

ఈ నెల 13 వరకు ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13వ తేదీ వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News January 31, 2026

NLG: అంబేడ్కర్ ఓపెన్ వ‌ర్సిటీ డిగ్రీ పరీక్షలు రీషెడ్యూల్

image

డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ సెమిస్ట‌ర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసిన‌ట్లు ప‌రీక్ష‌ల నియంత్ర‌ణాధికారి ప్రొఫెస‌ర్ బి.శ్రీనివాస్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డిగ్రీ 1, 3, 5 సెమిస్ట‌ర్ పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 17 నుంచి మార్చి 10వ తేదీ వ‌ర‌కు జరగనున్నాయి. విద్యార్థులు పూర్తి టైం టేబుల్ కోసం యూనివ‌ర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.

News January 31, 2026

మిర్యాలగూడ విద్యార్థినుల ప్రతిభ

image

నల్గొండ ఐటీ టవర్‌లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మిర్యాలగూడ విద్యార్థినులు ప్రతిభ చాటారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు 17 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. వారికి నిర్వాహకులు నియామక పత్రాలు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యాలు, పలువురు ప్రముఖులు అభినందించారు.

News January 31, 2026

నల్గొండ: మున్సిపల్ బరిలో సీపీఎం అభ్యర్థులు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం అభ్యర్థుల జాబితాను జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విడుదల చేశారు. నల్గొండలో మహమ్మద్ సలీం, మిర్యాలగూడలో ఏకాల పద్మ, మల్సూర్, మధులత, చిట్యాలలో జిట్టా నగేష్, దేవరకొండలో బిజిలి లింగయ్య, స్వప్న, జ్యోతి, నందికొండలో గోవింద్ రాజ్ పోటీ చేయనున్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

News January 31, 2026

నల్గొండ: ‘ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి’

image

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 7ఏ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

News January 31, 2026

నల్గొండ జిల్లాలో వింత పొత్తులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్‌ను నిలువరించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్షాలు BRS, BJP చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. చండూరు, MLG, చౌటుప్పల్ వంటి కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా కొన్నిచోట్ల రహస్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల బహిరంగ మద్దతు తెలుపుతున్నారు. ఈ వింత పొత్తులు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

News January 31, 2026

NLG: సీపీఎం నుంచి అయూబ్ ఖాన్ సస్పెన్షన్

image

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మహ్మద్ అయూబ్ ఖాన్‌ను పార్టీ నుంచి తొలగించినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే ప్రాథమిక సభ్యతం నుంచి తొలగిస్తున్నట్లు, అతనికి సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

News January 31, 2026

సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కసరత్తు

image

SRPT మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని ఆర్యవైశ్య సామాజికవర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త మురిశెట్టి లక్ష్మబి భార్య నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. రెడ్డి, యాదవ్ వర్గాల మధ్య సమన్వయం కోసం మధ్యేమార్గంగా ఆమెను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. మొత్తం 48 వార్డుల్లో 12 నుంచి 15 వరకు పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి కేటాయించేలా ఒప్పందం కుదిరింది.

News January 30, 2026

నల్గొండ: కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్జాలబావి సమీపంలోని ఎస్‌డబ్ల్యూసీ గోదాములను ఆయన పరిశీలించారు. నల్గొండ కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు ఒకేచోట కౌంటింగ్ నిర్వహించేలా అనువైన భవనాలను చూడాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి విడిగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లు ఉండాలని తెలిపారు.