Nalgonda

News February 2, 2026

CM రేవంత్ టూర్.. MLG జిల్లా కల నెరవేరేనా?

image

తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ ప్రకటనతో MLG జిల్లా ఏర్పాటు డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం MLGలో పర్యటించనున్నారు. జిల్లా ఏర్పాటుపై ఆయన ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అని పట్టణ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కల అయిన జిల్లా ఏర్పాటుపై చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కింది. CM పర్యటనతో జిల్లా వాసుల నిరీక్షణకు తెరపడుతుందో లేదో చూడాలి.

News February 2, 2026

మజ్లిస్ మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదు: అసదుద్దీన్

image

నల్గొండలో ఎంఐఎం మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను అక్రమార్కుల నుంచి కాపాడిన ఘనత తమదేనని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని, తమ అనుమతి లేకుండా అధికారం దక్కదని ధీమా వ్యక్తం చేశారు.

News February 1, 2026

మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రచార హోరు!

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా సీఎం స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే స్థానిక నేతలు సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

News February 1, 2026

NLG: పెన్షన్ కోసం టెన్షన్..

image

ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో జాప్యం చేయడంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి సుమారు 2.04 లక్షలు ఉండగా, వీటి పంపిణీకి నెలకు సుమారు రూ. 47.34 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్, జనవరికి సంబంధించిన పెన్షన్లు ఇంకా పంపిణీ కాకపోవడంతో పెన్షన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 1, 2026

NLG: సీపీఎం అభ్యర్థుల జాబితా విడుదల

image

జిల్లాలోని మున్సిపాలిటీలు, NLG కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రకటించారు. NLG కార్పొరేషన్లో 20వ డివిజన్ మహ్మద్ సలీం, MLG మున్సిపాలిటీ 3వ వార్డు ఏకాల పద్మ, 9వ వార్డు ఎస్సీ దోరెపల్లి మల్సూర్, 15 వార్డు రాజుగని కుమారి, 17వ వార్డు మల్లు మధులత, 29వ వార్డు డబ్బికార్ మల్లేశం, 41 వ వార్డు అజారాల, చిట్యాలలో ఒకటో వార్డు జిట్టా నగేష్‌కు కేటాయించారు.

News February 1, 2026

NLG: 1,707 నామినేషన్లు ఆమోదం!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో 162 డివిజన్లు, వార్డులకు గాను 1140 మంది అభ్యర్థులకు సంబంధించిన 1,707 నామినేషన్లు ఆమోదం పొందాయి. అందులో కాంగ్రెస్ 597, BRS 440, BJP 284 ఉన్నాయి. వీరిలో ప్రతిపార్టీలో 162 మందికే బీఫాం దక్కనుంది. మిగతావారు ఉపసంహరించుకుంటారా? రెబల్‌గా పోటీలో ఉంటారా అనేది రేపు తేలనుంది.

News February 1, 2026

NLG: రేపటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈసారి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన ప్రయోగ పరికరాలను ఇప్పటికే అందించింది. జిల్లాలో 143 జూనియర్ కాలేజీల నుంచి 9251 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News February 1, 2026

కౌంటింగ్ కేంద్రాల ఎంపికపై కసరత్తు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన భవనాల ఎంపికపై కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని సెట్విన్ స్కిల్ సెంటర్, రామానంద తీర్థ కళాశాల, గురుకుల బాలికల విద్యాలయాలను వారు నిశితంగా పరిశీలించారు.

News February 1, 2026

ఈ నెల 13 వరకు ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13వ తేదీ వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News February 1, 2026

ఈ నెల 13 వరకు ‘ప్రజావాణి’ రద్దు: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13వ తేదీ వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.