India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హాలియాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రమీలను అధికార పార్టీ నాయకులు గృహనిర్బంధం చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే భగత్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భగత్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేతేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తుంగతుర్తి గ్రామానికి చెందిన మేకల కాపరి జటంగి సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. సోమవారం మేకల మేత కోసం చెట్టు కొమ్మలు కొడుతుండగా కాలు జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో MA హిస్టరీ, టూరిజం సెమిస్టర్-1( R-25) సంబంధించిన పరీక్షల టైం టేబుల్‌ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి పరీక్షల టైం టేబుల్‌కు అధికారిక ఎంజీయూ వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.

జిల్లాలోని చిన్న, మధ్యతరహా సాగునీటి వనరుల గణనను ఈనెల 7వ తేదీలోగా 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లతో పాటు బోర్లు, బావుల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ సత్ఫలితాలనిచ్చిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రికార్డు స్థాయిలో 118 మంది బాల కార్మికులను (105 మంది బాలురు, 13 మంది బాలికలు) రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థకు కారణమైన వారిపై 92 కేసులు నమోదు చేశామన్నారు. చిన్నారులను పనుల్లో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం బీ.ఎడ్ సెకండ్ ఇయర్ మూడవ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 4వ తేది(బుధవారం) నుంచి జరగనున్నట్లు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి వెల్లడించారు. 4 నుంచి 13 వరకు జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరగనున్నాయి.

గుర్రంపోడు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక రైతుకు సంబంధించిన భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు RI మహమ్మద్ హకీమ్ రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకుని కార్యాలయంలోనే విచారణ జరుపుతున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడంతో ఉమ్మడి NLG జిల్లాలోని 5.69 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో మొత్తం 7.66 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. నల్గొండలో 3.60 లక్షలు, సూర్యాపేటలో 2.63 లక్షలు, యాదాద్రిలో 1.43 లక్షల కార్డులు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన VB-G RAM G పథకం కింద పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం విశేషం. ఈ నిర్ణయంతో గ్రామీణ కూలీలకు ఆర్థిక భరోసా లభించనుంది.

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 143 కళాశాలల నుంచి.. 9,251 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెండు విడతలుగా జరిగే ప్రయోగ పరీక్షలకు జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు అయ్యాయి.
Sorry, no posts matched your criteria.