India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అవార్డు దశలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నిధుల విడుదల కోసం పెండింగ్ వివరాలను అందజేయాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు.

నల్గొండ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అసలైన అభ్యర్థుల జాబితా ఖరారైంది. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీ పడుతున్నారు. నాయకులు వారే అయినా, పార్టీ గుర్తులు మాత్రం మారాయి. అధికార పార్టీ అండతో విజయంపై వారు ధీమాగా ఉండగా, సామాన్య ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో భర్తల కోసం భార్యలు ప్రచారం చేయగా, ఇప్పుడు భార్యల గెలుపు కోసం భర్తలు జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ముఖ్యంగా నల్గొం, మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠాలు మహిళలకే కేటాయించడంతో అభ్యర్థుల భర్తలు ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరి వికాస పథకం అటకెక్కింది. రెండేళ్ల క్రితమే జిల్లావ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ సౌకర్యం, మోటార్లు అందించలేదు. రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు ఈ పథకం ఉందా లేదా అని లబ్ధిదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మారిన వాతావరణ పరిస్థితులు.. సాగు ఖర్చులు పెరగడం.. దిగుబడులు తగ్గడం గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతుంది. ఈ యాసంగిలో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని పేర్కొన్నప్పటికీ.. ఈ సీజన్ ముగిసేనాటికి 4.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది.

తాగుడుకు బానిసై ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు (29) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిసయ్యాడని అతని భార్య కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, వంటశాల, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా MGU వర్సిటీ NSS ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి డా. రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు HIV పట్ల అప్రమత్తంగా ఉండాలని, టీకా ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చని సూచించారు. జీవనశైలి మార్పులు, వ్యాధిని తొలిదశలో గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్ వసంతకుమారి పేర్కొన్నారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.