Nalgonda

News February 4, 2026

మిర్యాలగూడకు బయలుదేరిన సీఎం రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ రఘువీర్‌రెడ్డి ఉన్నారు. గూడూరులో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.

News February 4, 2026

నల్గొండ మెడికల్ కాలేజీలో అధ్యాపకులకు శిక్షణ

image

గాంధీ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన ఆధునిక పద్ధతులపై 30 మంది అధ్యాపకులకు అవగాహన కల్పించారు. వైద్య విద్యలో వస్తున్న మార్పులు, అత్యాధునిక బోధనపై శిక్షణ ఇచ్చారు. మెరుగైన ఫలితాల కోసమే ఈ కార్యక్రమమని నిర్వాహకులు తెలిపారు.

News February 4, 2026

నల్గొండ: దరఖాస్తుల గడువు పొడిగింపు

image

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. బ్యాంకింగ్, ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఈ కోర్సుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి బి.శశికళ సూచించారు.

News February 4, 2026

నల్గొండ: ఓట్ల లెక్కింపు ఇక్కడే..

image

నల్గొండ మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్ కౌంటింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. నల్గొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు అర్జలబావిలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో జరుగుతుంది. మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల లెక్కింపును అవంతిపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించనున్నారు. లెక్కింపు సజావుగా సాగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

News February 4, 2026

NLG: అభ్యర్థులకు ‘కాల్’ టెన్షన్.. అంతా వాట్సాప్‌లోనే!

image

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను ‘రికార్డింగ్’ భయం వెంటాడుతోంది. ఓటర్లతో సాధారణ ఫోన్ కాల్‌లో మాట్లాడితే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారనే ఆందోళనతో అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు. కాల్ రికార్డింగ్‌కు అవకాశం లేని వాట్సాప్ కాల్స్‌పైనే వారు మొగ్గు చూపుతున్నారు. అత్యంత సన్నిహితులు తప్ప మిగతా వారందరితో వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరుపుతూ, ఓట్లు అభ్యర్థిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

News February 4, 2026

మిర్యాలగూడకు మొదటిసారి CM.!

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మిర్యాలగూడ రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ పట్టణంలో సీఎం పర్యటిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మొదటిసారి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనతో పట్టణానికి ఎలాంటి వరాలజల్లు కురిపించనున్నారని ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా ఏర్పాటు విషయం గురించి మాట్లాడతారా.. అనే చర్చ కొనసాగుతోంది.

News February 4, 2026

మిర్యాలగూడలో నేడు సీఎం రేవంత్ సభ

image

మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త హామీలకు అవకాశం లేకపోవడంతో, గత రెండేళ్ల పాలనపైనే ప్రధానంగా ప్రసంగించనున్నారు. మరోవైపు, నిధుల కేటాయింపులో వివక్ష, పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

News February 3, 2026

NLG: నా ప్రాణం.. చివరి శ్వాస వరకు మీకోసమే: మంత్రి కోమటిరెడ్డి

image

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున హోరెత్తించారు. నల్లగొండ తన ఇల్లు, ప్రాణం అని పేర్కొంటూ ప్రజలతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను అభ్యర్థించారు.

News February 3, 2026

నల్లగొండ: పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు జి.రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ రెండో విడత ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని 162 వార్డులు, 475 పోలింగ్ కేంద్రాలకు గాను.. 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 1713 మంది సిబ్బందిని కేటాయించారు.

News February 3, 2026

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వ్యూహం.. గెలుపే లక్ష్యం!

image

నల్లగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మనోరమ హోటల్‌లో 13వ డివిజన్ ముఖ్య నాయకులతో భేటీ కాగా, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. అభ్యర్థి జానికి మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కార్యకర్తలు ఐక్యంగా కష్టపడాలని మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.