India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో సాగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక కొనుగోలు విధానం రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు జరగడం వల్ల రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై విశ్వాసం పెరిగింది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

జిల్లాలో గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన 548 మంది అభ్యర్థులు నేటికీ ఎన్నికల ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించలేదు. జిల్లాలోని నకిరేకల్ మినహా నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూర్, చిట్యాల మున్సిపాలిటీలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 707 మంది పోటీ చేశారు. వీరిలో 159 మంది మాత్రమే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పించారు.

దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఈ నెల 30లోగా tso bmms.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్, ట్యాప్టాప్, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్స్, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ అందజేస్తుందని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ గాంధీ యూనివర్సిటీ పరిధిలో B.P.Ed, D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి-4 నుంచి ఫిబ్రవరి-11 మధ్య పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

బత్తాయి రైతులు ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ లాభాలు గడించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం రైతుల అనుభవాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దళారుల దోపిడీని అరికట్టి, గిట్టుబాటు ధర సాధించాలంటే ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (FPO) ఏర్పాటు ఆవశ్యకమని స్పష్టం చేశారు. మార్కెటింగ్, నిల్వ సౌకర్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ శ్రీమతి ఎ.అనిత తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్హత సర్టిఫికేట్ (8th క్లాస్ pass) జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని నల్గొండలోని మహిళా ప్రాంగణంలో సంప్రదించాలని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ 2026” అవగాహన సదస్సును ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. గతేడాది జిల్లాలో 950 ప్రమాదాలు జరగ్గా, 360 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వాహనదారులు, యువత పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 52 రోజులకు గాను గట్టుపైన రూ.28,98,762, గట్టు కింద అమ్మవారి ఆలయంలో రూ.3,85,695, (మొత్తం రూ.32 లక్షల 84 వేల 457) ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఈవో ఎస్ మోహన్ బాబు, దేవాదాయశాఖ పరిశీలకులు సుమతి పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సపావత్ రమ్యకు జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు ఆదేశాల మేరకు డీవైఎస్ఓ అక్బర్ అలీ రూ.15,000 చెక్కును అందజేశారు. జనవరి 23 నుంచి కోల్‌కతాలో జరిగే జాతీయ పోటీల్లో రమ్య పాల్గొననుంది. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.