Nalgonda

News June 3, 2024

NLG: గంటలోనే మొదటి రౌండ్ ఫలితం

image

ఎంపీ ఎన్నికల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, గంటలోనే మొదటి రౌండ్ ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 24 రౌండ్లలో పూర్తి లెక్కింపు కానుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పూర్తి ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి టేబుల్‌కు ఆయా పార్టీలకు సంబంధించిన ఒక ఏజెంట్ను నియమించుకునేందుకు అనుమతిస్తారు.

News June 3, 2024

మిర్యాలగూడ రైల్వే పట్టాలపై మృతదేహం 

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చారు. పోలీసులకు మృతుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరికి తరలించారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపునకు సంసిద్ధం కావాలి : కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి ఓట్ల లెక్కింపుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఆదివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

News June 2, 2024

స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు

image

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల 30 నిమిషాల వరకు స్థానికులు ఆధార్ కార్డుతో వచ్చినవారికి దర్శనం ఏర్పాటు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు

News June 2, 2024

నల్గొండలో తెలంగాణ అవతరణ దినోత్సవం

image

నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తికి గౌరవందనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జెండాను ఎగరవేశారు.

News June 2, 2024

చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: మత్య్సశాఖ

image

నీరు ఉన్న చెరువుల్లోనే ఉచిత చేప పిల్లలను వదిలామని, ఈ ప్రక్రియ మండల స్థాయి అధికారుల సమక్షంలో జరిగిందని మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పలు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. నీరు లేని చెరువుల్లో చేప పిల్లలు వదల లేదని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. కలెక్టర్ ఆమోదంతో బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

News June 2, 2024

నల్గొండ: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.

News June 2, 2024

బంగారంతో చిన్న సైజులో T-20 ప్రపంచకప్ 

image

ఈనెల 2 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ స్వర్ణకారుడు బంగారంతో సూక్ష్మసైజులో T-20 ప్రపంచకప్‌ను రూపొందించి అబ్బురపరిచాడు. భువనగిరికి చెందిన చొల్లేటి శ్రీనివాసచారి బంగారం, వెండితో సూక్ష్మసైజులో వివిధ రకాల వస్తువులు తయారు చేయడంలో ప్రావీణ్యుడు. గతంలో క్రికెట్ స్టేడియం, పార్లమెంట్ భవనం, పీసా టవర్, హరితహారం, ICC కప్, బంగారు బతుకమ్మ, వరల్డ్ కప్ తయారు చేశాడు.

News June 2, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

image

NLG- KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు పై ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

News June 1, 2024

చాణక్య X SURVEY: నల్గొండ, భువనగిరి కాంగ్రెస్‌దే..!

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. నల్గొండలో BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి, BJP నుంచి సైదిరెడ్డి రెడ్డి పోటీ చేశారు. ఇక భువనగిరిలో BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.