Nalgonda

News January 7, 2026

నల్లగొండ: దొంగతనాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర

image

జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆయన ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు రాత్రి గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. నేరాలు వదిలేసిన వారికి అండగా ఉంటామని తెలిపారు.

News January 7, 2026

నల్గొండ: ఈ నెల 10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతాయని డీఈఓ బిక్షపతి తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్ (లోయర్ & హైయర్) అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత కుట్టు మెషీన్లను తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోనే పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

News January 7, 2026

చెరువుగట్టులో దేవుడికే శఠగోపం..!

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది సిబ్బంది దేవుడికే శఠగోపం పెడుతున్నట్లు సమాచారం. ఆలయంలో అన్నదానానికి భక్తులు ఇస్తున్న విరాళాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ భక్తుడు అన్నదానానికి రూ.5 వేలు విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆలయ సిబ్బంది అతనికి రూ.5 వేలకు రశీదు ఇచ్చారు. కానీ ఆలయానికి మాత్రం 1000 జమ చేశాడని రాశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News January 7, 2026

పాడిపై చలిపంజా: తగ్గుతున్న పాల ఉత్పత్తి!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పాడి పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నుంచి చలి పెరగడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల ద్వారా రోజుకు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం చలి కారణంగా లీటర్ల కొద్దీ దిగుబడి తగ్గి, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

News January 7, 2026

నల్గొండ మున్సిపాలిటీది ఘనచరిత్ర

image

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.

News January 7, 2026

నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

News January 6, 2026

యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

మిర్యాలగూడ మండలం తుంగపాడులోని NDR యూరియా గౌడన్, NDCMS ఎరువుల దుకాణాలను మంగళవారం నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. యూరియా యాప్‌ రైతులు ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు నిత్యం యూరియా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, వ్యవసాయ అధికారులు ఉన్నారు.

News January 6, 2026

హెల్మెట్‌ లేదంటే.. చుక్క పెట్రోల్‌ పోయరు: నల్గొండ ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం జిల్లా పోలీస్‌ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘నో హెల్మెట్‌ – నో పెట్రోల్‌’ నిబంధన అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ వెల్లడించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయరాదని ఇప్పటికే అన్ని బంకు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

News January 6, 2026

NLG: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కారు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి వద్ద KDD-జడ్చర్ల రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుడు పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాలకి చెందిన మారుపాక గణేష్‌గా గుర్తించారు. గణేష్ అంగడిపేట ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 6, 2026

NLG: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్

image

ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘ఉపాధి పునరావాస పథకాన్ని’ ప్రవేశపెట్టిందని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా సేవా రంగాల్లో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవనం గడపవచ్చన్నారు.