Nalgonda

News January 9, 2026

బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: నల్గొండ ASP

image

నల్గొండ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

News January 9, 2026

నల్గొండ: ‘నో హెల్మెట్-నో పెట్రోల్’.. వ్యాపారులకు ఫుల్ డిమాండ్

image

జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తుండటంతో హెల్మెట్ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో ఇంధనం పోయాలని ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News January 8, 2026

బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

image

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

News January 8, 2026

ఇళ్లకు తాళం వేస్తే జాగ్రత్త : ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

సంక్రాంతి సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. నగదు, నగలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపరిచితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 8, 2026

నల్గొండ: అన్ని పార్టీల చూపు అటు వైపు..

image

పురపాలిక నుంచి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన నల్గొండలో రాజకీయ సెగ మొదలైంది. తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహల్లో మునిగిపోయాయి. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తుండగా, కేంద్ర నిధులే అస్త్రంగా కమలనాథులు కదులుతున్నారు. పాత పట్టును నిలుపుకునేందుకు BRS మౌనంగా పావులు కదుపుతోంది. ఇక్కడ ఎవరు పాగా వేస్తారో కామెంట్ చేయండి.

News January 8, 2026

ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

image

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 7, 2026

చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

image

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.

News January 7, 2026

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ పూర్తయిందని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

News January 7, 2026

ధరణి చిక్కుముడులు వీడాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు సత్వరమే పరిష్కరించి, బాధితులకు ఊరటనివ్వాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ, భూ రికార్డుల సవరణ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. వివాదాల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.

News January 7, 2026

గొర్రెలు, మేకలకు ‘పాక్స్‌’ టీకాలు: జిల్లా పశువైద్యాధికారి

image

ఈ నెల 8 నుంచి 22 వరకు నల్లగొండ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు పాక్స్‌ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డా.జి.వి.రమేష్ తెలిపారు. వైరస్‌ వల్ల సోకే ఈ అంటువ్యాధి నివారణకు 78 బృందాలు గ్రామాల్లో పర్యటించనున్నాయి. జ్వరం, చర్మంపై బొబ్బలు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పెంపకందారులు మూడు నెలలు పైబడిన మూగజీవాలకు టీకాలు వేయించి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.