India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు సత్తా చాటింది. మూడో స్థానం కోసం నిజామాబాద్‌తో జరిగిన పోరులో 2-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని రాకేష్, అఖిల్ నందన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ యావర్‌ను డీఈఓ భిక్షపతి, డీవైఎస్‌ఓ అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హిమాం ఖరీం, ఎస్జీఎఫ్ కార్యదర్శి నర్సి రెడ్డి అభినందించారు.

NLG జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కేవలం తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 2, 3 తేదీల్లో డైట్ కాలేజీలో జరిగిన ఈ వేడుకలో కొత్త ఆవిష్కరణల కంటే పాత ప్రాజెక్టులే ఎక్కువగా కనిపించాయని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమిచ్చారని, విద్యార్థులను కొత్త ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించడంలో విఫలమయ్యారని విద్యావేత్తలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రహదారి భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా <<18756458>>‘నో హెల్మెట్-నో పెట్రోల్’<<>> విధానాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేనిదే బంకుల్లో పెట్రోల్ పోయవద్దని పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే బంక్ యజమానులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 4 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు పరీక్షల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.

జిల్లాలోని 102-అమ్మఒడి సేవలలో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈనెల 5న (సోమవారం) ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఈఎమ్ఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ప్రతినిధులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎల్ఎమ్‌వీ (LMV) లైసెన్స్, బ్యాడ్జ్ కలిగి ఉండి, 23-35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో స్థానిక 108 కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.