Nizamabad

News April 14, 2025

NZB: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

News April 14, 2025

NZB: రిటైర్డ్ పోలీసుల నూతన కార్యవర్గం ఎన్నిక

image

తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు. న్యాయ సలహాదారుగా Rtd DSP మనోహర్‌ను ఎన్నుకున్నారు.

News April 13, 2025

NZB: కారు యాక్సిడెంట్.. ఒకరి మృతి 

image

ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నందిపేట్‌కు చెందిన శ్రీను(48) ఆదివారం మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. మృతుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కమ్మర్‌పల్లి గురుకుల పాఠశాలలో చికెన్ సప్లై చేసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఉప్లూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు గాయాలవడంతో మృతి చెందాడు.

News April 13, 2025

NZB: బైసాఖీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

image

అమీర్‌పేట్‌లో ఆదివారం నిర్వహించిన బైసాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో జీవించే రాష్ట్రమన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామన్నారు.

News April 13, 2025

NZB: సీపీకి తల్వార్ బహూకరించిన సిక్ కమిటీ

image

సిక్కుల పవిత్ర బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాముల బస్తిలోని ఫతేపూర్ గురుద్వారా సాహెబ్‌లో గురుద్వారా కమిటీ సభ్యులు వివిధ భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్‌ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోఖీ కమిటీ సభ్యులతో కలిసి బహూకరించారు.

News April 13, 2025

NZB: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంప్

image

జిల్లాలోని విద్యార్థినులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఉచితంగా నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిజామాబాద్ RBVRRస్కూల్‌లో శిబిరం ఉంటుందన్నారు. దీనికి 9,10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఇందులో సెల్ఫ్ డిఫెన్స్, మోటివేషన్ సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై పోలీస్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 13, 2025

NZB: TU పరిధిలో 16 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.

News April 13, 2025

NZB: TU పరిధిలో 16 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.

News April 13, 2025

సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు ఆత్మహత్య

image

సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

News April 12, 2025

NZB: బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలి: ఎంపీ

image

అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకాంక్షించారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణతో కలిసి కంఠేశ్వర్ ఆలయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నామన్నారు.