Nizamabad

News April 14, 2026

ఇందల్వాయి: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఇందల్వాయి మండలం గంగారం తండా సమీపంలో ఎన్‌హెచ్-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గంగార తండా శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

News April 14, 2026

రాష్ట్రస్థాయి పోటీలకు 10 మంది నిజామాబాద్ రెజ్లింగ్ క్రీడాకారులు

image

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు నిజామాబాద్‌కు చెందిన 10 మంది క్రీడాకారులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారని NZB జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో జరిగేలో రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎక్స్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు కోరారు.

News April 14, 2026

రాష్ట్రస్థాయి పోటీలకు 10 మంది నిజామాబాద్ రెజ్లింగ్ క్రీడాకారులు

image

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు నిజామాబాద్‌కు చెందిన 10 మంది క్రీడాకారులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారని NZB జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో జరిగేలో రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎక్స్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు కోరారు.

News April 13, 2026

NZB: అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్

image

హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీకేరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. ఇండ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందన్నారు. మిగిలిపోయిన మండలాల్లో 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు.

News April 13, 2026

UPDATE: నిజామాబాద్‌లో సహజీవనం.. చీర కొంగు బిగించి హత్య

image

సహజీవనం చేస్తున్న మహిళ, <<19639421>>వ్యక్తి గొంతుకు చీర బిగించి హత్య<<>> చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదిలాబాద్‌కు చెందిన జక్కులోల మోహన్(40) నిజామాబాద్ వినాయక్ నగర్‌కు చెందిన సౌందర్యతో ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా సదరు మహిళ మోహన్ మెడకు చీర కొంగు బిగించి హత్య చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు 4 టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపారు.

News April 13, 2026

NZB: 24 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 24 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.

News April 13, 2026

NZB: హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

image

జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇళ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి నిర్వహించే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తవు లేకుండా చూడాలన్నారు.

News April 13, 2026

NZB: ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: CP

image

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని NZB పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్‌లో భాగంగా సోమవారం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.

News April 13, 2026

NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 124 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు.

News April 13, 2026

నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, ​పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, ​యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.