News April 13, 2026
UPDATE: నిజామాబాద్‌లో సహజీవనం.. చీర కొంగు బిగించి హత్య

సహజీవనం చేస్తున్న మహిళ, <<19639421>>వ్యక్తి గొంతుకు చీర బిగించి హత్య<<>> చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదిలాబాద్‌కు చెందిన జక్కులోల మోహన్(40) నిజామాబాద్ వినాయక్ నగర్‌కు చెందిన సౌందర్యతో ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా సదరు మహిళ మోహన్ మెడకు చీర కొంగు బిగించి హత్య చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు 4 టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.