Nizamabad

News May 21, 2024

NZB: మొదటి రోజు పరీక్షకు 92 మంది గైర్హాజరు

image

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ 2024 పరీక్షలు జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్, NZB నాలెడ్స్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 170 మందికి 92 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 170 మందికి 156 మంది హాజరయినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21,585 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

News May 21, 2024

NZB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై ఫోక్సో కేసు నమోదైన ఘటన నిజామాబాద్‌లోని మోపాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని పరారయ్యాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాలుగు నెలల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమె గర్భం దాల్చడంతో యువకుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News May 21, 2024

బాన్సువాడలో జంట మృతదేహాల ఆచూకీ లభ్యం

image

బాన్సువాడ పట్టణంలో ఇటీవల గుర్తించిన అనుమానాస్పద గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ గుర్తించినట్లు సీఐ కృష్ణ తెలిపారు. వారిద్దరూ మద్నూర్ మండలంలోని హండేకేలూర్ గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు లక్ష్మీ(35), సాయినాథ్(8)గా గుర్తించారు. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

News May 21, 2024

కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 6లోగా ధృవీకరణ పత్రాలు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

News May 20, 2024

KMR: దినాలకొచ్చి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

image

దినాలకొచ్చిన..ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన KMR జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ (35)ఈ నెల13న మృతుడి భార్య సాగరిక తాత మరణించాడని అంత్యక్రియలకు వచ్చారు. అంత్యక్రియల అనంతరం మృతుడు శుక్రవారం కాటేపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. SI కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

నిజామాబాద్: ట్రాక్టర్, బైకు ఢీ.. ఒకరు మృతి

image

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏనుగందుల లక్ష్మణ్(30), సునీల్ బైకుపై వెళ్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. సునీల్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

నిజామాబాద్: హోటళ్లలో తనిఖీలు

image

నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ అనురాగ్, డిప్యూటీ కమిషనర్ల ఆదేశాల మేరకు నగరంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్ యజమానులకు కిచెన్, ఇతర సెక్షన్స్‌లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. లేదంటే పెనాల్టీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్‌తో పాటు ప్రభుదాస్, సునీల్, శ్రీకాంత్, ప్రశాంత్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

News May 20, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో దొంగల చేతివాటం

image

నగరంలో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. షాద్ నగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ సలాం కుటుంబం ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళారు. తిరిగి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి కనిపించింది. ఆరోటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

News May 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 20 మంది పై కేసు

image

నిజామాబాద్‌లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్ సమీపంలో వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మంది పై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. సరైన పేపర్లు లేని వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News May 20, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1056 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు NZB- 530 (5300 వార్డులు) ఉండగా.. KMR-526 (4,642 వార్డులు) గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.