India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం సందర్శించారు. డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ విధానం, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఛైర్మన్ ఈ అంశం తమకు అవగాహన ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

నిజామాబాద్ జిల్లా జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ, మరో జైలర్ సాయి సురేశ్‌ను ADB జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా జైలర్లిద్దరూ తమను తీవ్రంగా కొట్టారని వారం రోజుల క్రితం జైలులోని ఇద్దరు ఖైదీలు చాకలి రాజు, కర్నే లింగం జడ్జికి తెలపడంతో ఈ విషయంపై జైలు శాఖ అధికారులు జిల్లా జైలుకు వచ్చి విచారణ చేపట్టి డీజీపీకి నివేదిక ఇవ్వగా వేటు పడిందని తెలిసింది.

నిజామాబాద్ జిల్లాలో అంగన్‌వాడీల్లో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,501 ప్రధాన కేంద్రాలతోపాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచర్, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు.

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాబితా రూపొందించాలన్నారు.

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

మోపాల్ మండలం శివలాల్ తండాలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కేతావత్ రామచందర్(43)కు పొలంలో పనిచేస్తుండగా పాము కరిచింది. దీంతో అతన్ని NZBలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లడు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.