Nizamabad

News January 9, 2026

బాస్కెట్ బాల్ స్టేట్ కమిటీలో నిజామాబాద్ జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేశ్ నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేశ్ కుమార్‌కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

News January 9, 2026

టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News January 9, 2026

NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్‌కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

News January 8, 2026

నిజామాబాద్: PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్

image

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా NZBకు చెందిన జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన PDSU 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యా రంగ సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతనని పేర్కొన్నారు.

News January 8, 2026

NZB: ఈవీఎం గోడౌన్‌‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News January 8, 2026

నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

image

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.

News January 8, 2026

NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.

News January 8, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠత

image

జిల్లాలోని NZB మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వు అవుతాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దామాషా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు అవుతుండగా మిగిలిన స్థానాలు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతుందోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

News January 8, 2026

హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.

News January 8, 2026

NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

image

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.