Nizamabad

News January 13, 2026

NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

image

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్‌లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్‌లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్‌గల్‌లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్‌లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

News January 13, 2026

నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..!

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించింది. మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా, టీపీసీసీ చీఫ్‌గా ఉండటంతో నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున టార్గెట్ మిస్ కావొద్దని భావిస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో దోస్తీతో మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

News January 13, 2026

పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.

News January 12, 2026

NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.

News January 12, 2026

NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.

News January 12, 2026

NZB: ‘ప్రజావాణికి అధికారులందరూ విధిగా హాజరు కావాలి’

image

‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆమె అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై మొత్తం 84 ఫిర్యాదులను అందజేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 12, 2026

నిజామాబాద్: బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించండి

image

నిజామాబాద్‌లోని ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ మంచి ఫలితాలు సాధిస్తుంది. కానీ అద్దె భవనంలో కొనసాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ స్టడీ సర్కిల్‌కు సొంతభవనం నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మరో రెండు ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు.

News January 11, 2026

NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.

News January 11, 2026

నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

image

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.

News January 11, 2026

నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

image

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.