Nizamabad

News November 30, 2024

NZB: 9 నెలల్లో 50 వేల GOVT ఉద్యోగాలిచ్చాం: టీపీసీసీ చీఫ్

image

తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతుంటే.. KCR ఫామ్ హౌస్‌లో పన్నీరు తిన్నాడని మండిపడ్డారు. పదేళ్లలో KCR 50 వేల GOVT ఉద్యోగాలిస్తే తాము కేవలం 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని చెప్పారు.

News November 30, 2024

NZB: గులాబీ దళంలో నూతనోత్తేజం…!

image

ఉమ్మడి నిజామాబాద్‌లో నిన్న శుక్రవారం జరిగిన దీక్షాదివస్ గ్రాండ్ సక్సెస్ అయింది. పెద్ద ఎత్తున గులాబీ సైనికులు తరలి రావడంతో నిజామాబాద్, కామారెడ్డిలో దీక్షాదివస్ జయప్రదమై గులాబీ దళంలో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తమ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. ఉద్వేగ పూరితంగా సాగిన వారి ప్రసంగం తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేయడం గులాబీ సైనికుల్లో నయా జోష్ నింపింది.

News November 30, 2024

NZB: విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. బోధన్‌కు చెందిన శివజశ్విత్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే జ్వరంతో శుక్రవారం విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు 4వ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ విచారణ చేపట్టారు.

News November 30, 2024

కామారెడ్డి: కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త

image

పట్టణకేంద్రంలోని దేవివిహార్‌లో కార్తీక మాసం చివరి శుక్రవారం నిర్వహించిన కోటిదీపోత్సవ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు. అశేష జన సందోహంలో కార్తీక మాస పవిత్రతను సృష్టించేలా కోటి దీపోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

News November 29, 2024

నిజామాబాద్‌లో 9వ తరగతి విద్యార్థి మృతి

image

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న జశ్వంత్‌రెడ్డి శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 29, 2024

NZB: రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో రూ.22 కోట్లలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లవెల్లి-మంగ్యానాయక్ తండా రోడ్డు (రూ.4 కోట్లు), నల్లవెల్లి -గౌరారం రోడ్డు (రూ.18 కోట్ల) పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 29, 2024

జుక్కల్: రాత్రి రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

image

హైవే-161 పై గురువారం <<14736707>>రాత్రి<<>> రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జుక్కల్ SI వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్ పల్లికి చెందిన వంశీ(24), కార్తీక్ అన్నదమ్ముల కుమారులు. వీరు బైక్‌పై పంటను చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో వీరు స్పాట్‌లోనే మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కార్తీక్ భార్య 5 నెలల గర్బిణి.

News November 29, 2024

నిజామాబాద్: SGF హాకీ టోర్నమెంట్ పరిశీలకుడిగా స్వామి కుమార్

image

ఎస్జీఎఫ్ అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు హుజూరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరుగనున్నాయి. కాగా.. టోర్నీ పరిశీలకుడిగా జడ్పీహెచ్ఎస్ జాకోరా, వర్ని పీఈటీ డాక్టర్ స్వామి కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఎస్జీఎఫ్ సెక్రెటరీ నాగమణి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, సీనియర్ హాకీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

News November 28, 2024

ఆర్మూర్‌లో విషాదం.. డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

image

ఆర్మూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన ఆర్మూర్ లో గురువారం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్లో ఉదయం మట్ట ధనస్వి(4) చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదుటే ఉన్న డ్రైనేజీల్లో పడిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు రెండు గంటలపాటు కాలనీ అంతా వెతికినా దొరకలేదు. చివరికి డ్రైనేజీల్లో చిన్నారి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

News November 28, 2024

BRS నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

image

టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ BRS నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే దిలావర్పూర్‌లోని ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖాముఖి చర్చకు రమ్మన్నారు. ఫ్యాక్టరీకి BRS ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఫ్యాకర్టీ గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు.