India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని MPఅర్వింద్ ధర్మపురి కోరారు. జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట పండిందని అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవన్నారు.

మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని గ్రామ సభలను సందర్శించాలని ఆదేశించారు.

వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తించేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో వలస కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, తదితర చోట్ల పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసేలా పర్యవేక్షించాలన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమయపాలన పాటించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. సోమవారం ప్రజావాణిలో 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు చేయరాదన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురు గాలులతో ఆకాల వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికోచ్చిన వరి, మెక్కజోన్న పంటలకు నష్టం కలుగుతుందన్నారు. దిగుబడి తగ్గుతుందన్నారు.

Sorry, no posts matched your criteria.