Nizamabad

News March 13, 2026

‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

image

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

News March 13, 2026

NZB: కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు.

News March 13, 2026

NZB: కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు.

News March 13, 2026

NZB: ‘గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు’

image

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. IDOCలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై ఈ సమావేశంలో సమీక్షించారు.

News March 13, 2026

NZB: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 13, 2026

UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

image

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.

News March 13, 2026

NZB: 15 నుంచి ఇంటర్ మూల్యాంకనం

image

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మూల్యాంకనం సబ్జెక్ట్‌ల అధ్యాపకులు 15న రిపోర్ట్ చేయాలని DIEO టీ.రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు వారి కళాశాల లాగిన్‌లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు. విధుల్లోని అధ్యాపకులను రిలీవ్ చేయాలని, రిలీవ్ చేయని ప్రిన్సిపల్, యాజమాన్యాలపై చర్యలు తప్పవన్నారు.

News March 13, 2026

NZB: ‘గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలి’

image

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని NZB పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్‌ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని MP అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

News March 13, 2026

NZB: 398 మంది విద్యార్థులు గైర్హాజరు

image

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 398 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,119 మంది విద్యార్థులకు గాను 15,721 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,085 మంది విద్యార్థులకు గాను 13,783 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,034 మంది విద్యార్థులకు గాను 1,938 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు.

News March 13, 2026

NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.