India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం జరగనుంది. భక్తులంతా రథోత్సవాన్ని వీక్షించేలా నేడు ఉదయం 11:30గంటల నుంచి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో చుట్టూ పక్కల గ్రామాల భక్తులే కాకుండా జిల్లా నుంచి పాల్గొంటారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గాప్రసాద్ తెలిపాడు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గప్రసాద్ తెలిపాడు.
ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని అన్నారు. డిఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ తన ఆశయమని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలన్నారు.
నిజామాబాదు జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బందులు పాటించడం లేదని తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి చెంది ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.
కల్లు సీసాలో బల్లి కలకలం రేపిన ఘటన రెంజల్‌లో చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రంలోని ఓ కల్లు బట్టిలో ఓ వ్యక్తి కొన్న కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షమైంది. గమనించకుండా అతడు కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తోటి వారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.
బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.