India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NZB పార్లమెంట్ స్థాయి BJP విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. మాధవ్ నగర్ లోని కమ్మ సంఘంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, NZB MP అర్వింద్ ధర్మపురి, MLA లు హాజరవుతున్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.

నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్‌కు చెందిన యాదగిరి, గూపన్‌పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్‌లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచించారు.

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచించారు.

పటాన్ చెరులోని ఇక్రిశాట్‌ను ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డితో కలిసి రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్ తదితర బృందం సందర్శించింది. ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఇక్రిశాట్‌లో సాగు చేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కోరారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్ కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్‌ఛార్జ్ ఆకాశ్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో భేటీ అయ్యారు. రామ్ చరణ్ ఆత్మహత్య ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రామ్ చరణ్ (15) అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ స్వామి, డా.సైదా జైనబ్, ఫణి కుమార్, డా.జ్యోతి విచారణ జరిపి నివేదిక అందజేశారు.
Sorry, no posts matched your criteria.