Nizamabad

News March 9, 2026

NZB: ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

image

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

News March 9, 2026

NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌ఓ

image

నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.

News March 8, 2026

NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

image

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.

News March 8, 2026

నిజామాబాద్ జిల్లాలో ‘అతివలదే’ అధికారం

image

NZB జిల్లా ప్రగతి పథానికి మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన జడ్జీగా భరత లక్ష్మీ, DMHOగా డా.రాజశ్రీ, జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా పద్మశ్రీ, RTC RMగా జ్యోత్స్న జిల్లా పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాకుండా పలు శాఖల్లో అధికారులుగా మహిళలు రాణిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

News March 8, 2026

NZB: కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కేంద్రీ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను భర్తీకి సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర రావు తెలిపారు. నిజామాబాద్, బోధన్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులను నియమించడానికి NZB కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

News March 8, 2026

NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News March 7, 2026

NZB: బార్ ఎన్నికల అధికారుల నియామాకం

image

నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా సీనియర్ న్యాయవాదులు ఆమీదాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్‌లను నియమించినట్లు బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేష్ల ప్రక్రియకు సంబంధించి వివరాలు ఎన్నికల అధికారులు తెలియజేస్తారని వారు పేర్కొన్నారు.

News March 7, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.

News March 7, 2026

NZB: ఆస్తి పన్ను సకాలంలో వసూలు చేయాలి: కమిషనర్

image

నిజామాబాద్‌లో ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఇతర శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 7, 2026

నిజామాబాద్: ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య..!

image

నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాకేశ్ (28) అనే యువకుడు శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడికి భార్య, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.