Nizamabad

News March 2, 2026

NZB: రేపటి నుంచి వైన్స్ బంద్

image

హోలీ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ CP సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

News March 2, 2026

NZB: 34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 34 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు CP చెప్పారు.

News March 2, 2026

NZB: జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోళీ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

News March 2, 2026

డిచ్‌పల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విక్రమ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కి చెందిన జగన్నాథం శనివారం దూస్‌గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చాడు. ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2026

NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News March 1, 2026

నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

News March 1, 2026

NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.

News March 1, 2026

NZB: పీఎంశ్రీ పాఠశాలలను పరిశీలించిన సెంట్రల్ నోడల్ అబ్జర్వర్

image

జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు.

News February 28, 2026

NZB: ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలి

image

GGHలో కొనసాగుతున్న ప్రసూతి సేవల విభాగాన్ని వెంటనే MCHలోకి మార్చాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన మాతాశిశు ఆరోగ్య కేంద్రం (MCH), క్రిటికల్ కేర్ యూనిట్‌లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. సుదీర్ఘ కాలం నుంచి పలు పనులు పెండింగ్‌లోనే ఉండడం గమనించిన సుదర్శన్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

NZB: వారిపై చర్యలు తీసుకోవాలి: సుదర్శన్ రెడ్డి

image

లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను గుర్తించాలన్నారు.