India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలులో రెండేళ్ల బాలుడు లభ్యమైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో బాసర రైల్వే స్టేషన్ వద్ద S6 కోచ్‌లో రెండేళ్ల బాలుడిని స్థానికులు గుర్తించారు. చుట్టుపక్కల వెతికినా ఎవరూ లేకపోవడంతో రైల్వే ఎస్ఐ, సిబ్బంది కలిసి బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ సభ్యులకు అప్పగించారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌ఛార్జ్ డీపీఓ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
మూత్ర విసర్జన కోసం వెళ్లి రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారానికి చెందిన మహ్మద్ ఖాసీం (71) సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మూత్ర విసర్జన కోసం వెళ్లి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.
నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మౌలానా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బోధన్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలో నివాసముంటున్న బాలిక (4) శనివారం ఇంటిముందు ఆడుకుంటుండగా.. 13 ఏళ్ల బాలుడు చిన్నారిని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. చిన్నారి అరుపులు విన్న ఓ మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.
నిజాంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన శివానంద్ మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లి ఈతడానికి రాక ప్రమాదవశాత్తు పడి ఆదివారం మృతి చెందారు. విద్యార్థి శివానంద్ బాన్సువాడ ఠాగూర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజకీయ నాయకులకు వారి ముందే వారిని నవ్వుతూ కవిత్వంలో విమర్శించే ఆయుధమే ముషాయిరా అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎన్నారై కాలనీలో జరిగిన ముషాయిరాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముషాయిరా ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలు వారి జీవన విధానం కళ్లకు కట్టినట్లుగా కవులు వినిపిస్తారన్నారు.
వర్ని మండలం బడాపహాడ్ మెట్ల సమీపంలోని కాలువ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు వర్ని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మృతురాలి వయసు 70 ఏళ్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాలకృత్యాల కోసం వెళ్లి కాలువలో పడి మృతి చెందిఉంటుందని భావిస్తున్నారు. బడాపహాడ్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ నుంచి మాధవనగర్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 4.2 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ SHOబి.దిలీప్ కుమార్ తెలిపారు. ఒక కేసులో నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి, పల్సర్ బైక్ ను సీజ్ చేయగా ద్వారకానగర్‌కి చెందిన సాజిత్ అలీ ఆటోలో 2.1 కిలోలు పట్టుకోగా నిందితుడు పరారయ్యాడన్నారు.
Sorry, no posts matched your criteria.