Nizamabad

News July 29, 2024

మద్నూర్: వివాహిత ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దతడ్గూర్‌కి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సాయిలు తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రకళ(25) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

News July 29, 2024

KMR: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు..ఎప్పుడంటే..?

image

కామారెడ్డి ఇందిర గాంధీ స్టేడియంలో AUG 2న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు KMR జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జావెలిన్ 100, 400 mtrs, అంశాల్లో..అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. వయస్సు దృవీకరణ పత్రంతో ఉదయం 8 గంటల లోపు స్టేడియం నందు హాజరు కావాలని కోరారు.

News July 29, 2024

బండారు దత్తాత్రేయను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా గవర్నర్ ఆహ్వానం మేరకు బోనాల పండుగ సందర్భంగా విందుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ అంటే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వ్యక్తి అని ఆయన అన్నారు. అనంతరం ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించారు.

News July 28, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

* నిజామాబాద్‌లో అట్టహాసంగా ఊర పండగ.. కొలువుదీరిన దేవతలు
* ఎల్లారెడ్డిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన MP సురేశ్ షెట్కార్, MLA మదన్ మోహన్
* బాన్సువాడలో బోనాలు.. బోనమెత్తిన MLA పోచారం
* నిజాంసాగర్: రైతుల పేరిట రూ.కోట్లు కాజేసిన గాయత్రీ షుగర్స్
* ఉమ్మడి జిల్లాల్లో అంబరాన్నంటిన తీజ్ పండగ ఉత్సవాలు
* ఆర్మూర్: యువతికి సైబర్ నేరగాళ్ల బెదిరిపులు

News July 28, 2024

NZB: ఆగస్టు 3 నుంచి రాష్ట్రస్థాయి క్యారం ఛాంపియన్‌షిప్

image

ఆగస్టు 3 నుంచి 6 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి క్యారం ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు క్యాతం సంతోష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలు మందుల హనుమాన్లు స్మారకార్థం భీంగల్‌లోని జేబీఎస్ గార్డెన్‌లో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో నేషనల్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులు తమ పేర్లను ఆగస్టు 1లోపు నమోదు చేసుకోవాలన్నారు.

News July 28, 2024

బిచ్కుంద: మార్కెట్‌లో 20 కిలోల చేప

image

బిచ్కుంద మండల కేంద్రంలోని చేపల మార్కెట్‌లో ఆదివారం 20కిలోల చేప కనిపించింది. మత్స్యకారులు బాలు, అజయ్ మాట్లాడుతూ.. కౌలాస్ ప్రాజెక్ట్‌లో ఇలాంటి రెండు పెద్ద చేపలను పట్టినట్లు తెలిపారు. కాగా వాటిని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

News July 28, 2024

నిజామాబాద్‌కు 64 ఎలక్ట్రికల్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలకు 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా NZB డీపో-2కు 12 బస్సులు కేటాయించగా శనివారం 3 వచ్చాయి. మరో 8 కంపెనీ నుంచి రానున్నాయి. NZB, కరీంనగర్ జిల్లాలకు కలిపి మొదటి విడతగా 100 బస్సులు కేటాయించారు. వీటిలో ఇంకా NZBకు 48 రానున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో విడతలో 16 బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.

News July 28, 2024

పారిస్ ఒలింపిక్స్.. కాసేపట్లో బరిలోకి నిఖత్

image

పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా నేడు మహిళల 50 కేజీల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈరోజు సాయంత్రం 3.50గంటలకు బరిలో దిగనున్నారు. మ్యాక్సీ కరీనా (జర్మనీ)తో నిఖత్ తలపడనున్నారు. రింగ్‌లో దూకుడైన ఆట తీరుతో నిఖత్ తన ఒలింపిక్స్ బౌట్‌లో ఎలాంటి ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి.. ALL THE BEST

News July 28, 2024

NZB: అనర్హులు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అనర్హులు మాత్రం దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. సర్వీస్ పింఛన్‌తో పాటు ఆసరా పింఛన్లను ఏళ్లుగా తీసుకుంటున్న 555 మందిని అధికారులు ఇటీవల గుర్తించారు. వీరికి పింఛన్లను నిలిపివేయించి, నోటీసులు జారి చేశారు. కొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. కాగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రూ. 3.63 కోట్లు నష్టపోయింది.

News July 28, 2024

ఎల్లారెడ్డి: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

image

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగి విఠల్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాజు తెలిపారు. మద్యం తాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. సస్పెండైన వ్యక్తి అనుమతి లేకుండా ఎల్లారెడ్డి మండల కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.