Nizamabad

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.

News February 21, 2026

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

image

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 21, 2026

ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

image

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.

News February 21, 2026

NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

image

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

News February 21, 2026

NZB: వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?

image

నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన నేపథ్యంలో NZB జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్ – మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి – సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దాన్ – ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News February 20, 2026

NZB: నేషనల్ వాలీబాల్ పోటీలకు మనీష్ ఎంపిక

image

మోపాల్ మండలం కాంజర మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థి మనీష్ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న మనీష్, సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) విభాగంలో తన ప్రతిభ చాటి ఈ గౌరవం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మురళి, పీఈటీ వినోద్ గర్వంగా ప్రకటించారు. మనీష్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

News February 20, 2026

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు: కలెక్టర్

image

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.

News February 20, 2026

పరీక్షల నిర్వహణలో CS, DOలదే ముఖ్య పాత్ర: DIEO

image

పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారు(DO)లదే ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్
విద్యా అధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుందన్నారు.

News February 20, 2026

బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

image

నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News February 20, 2026

NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

image

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్‌కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.