India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్‌కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్‌రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు. ఫోన్లో ‘చైల్డ్ సెట్టింగ్ టూల్స్’ వాడాలని చెప్పారు.

ఎడపల్లి మండల కేంద్రంలో వివాహవిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం వేధింపులతోనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శైలజకుఎడపల్లికి చెందిన వీర్ల సతీష్‌తో వివాహం జరిగింది. దుబాయ్ వెళ్లేందుకు రూ.లక్ష తీసుకురావాలని శైలజను సతీష్ వేధించాడు. వేదింపులు భరించలేక గురువారం శైలజ ఉరి వేసుకుంది.

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.

నిజామాబాద్‌లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్‌సేల్‌లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.