Nizamabad

News February 17, 2026

NZB: 21 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌కు మేయర్ పీఠం

image

21 ఏళ్ల తరువాత నిజామాబాద్ నగరపాలక మేయర్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. కార్పొరేషన్‌గా మారిన తరువాత 2006లో జరిగిన తొలి ఎన్నికల్లో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2014, 2020లో జరిగి ఎన్నికల్లో BRS అభ్యర్థులు ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని వరుసగా దక్కించుకున్నారు. 21 ఏళ్ల తర్వాత.. కాంగ్రెస్ తరఫున కూరగాయల ఉమారాణి మేయర్ అయ్యారు.

News February 16, 2026

NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.

News February 16, 2026

NZB: మేయర్ ఉమారాణి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి నగరంలోని కసాబ్ గల్లికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. గర్ల్స్ హై స్కూల్ 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చేసిన ఆమె ఓపెన్‌లో BA పూర్తి చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజినీర్లు, మరొకరు MBA చేశారు. ఆమె భర్త కరాటే రమేశ్ అందరికీ సుపరిచతమే.

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.

News February 16, 2026

NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

News February 16, 2026

NZB: మేయర్ అభ్యర్థిగా ఉమారాణి ఖరారు?

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సమాచారం. అయితే రమేశ్ గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి రావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు.

News February 16, 2026

నిజమాబాద్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

image

నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క నగరానికి రానున్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. MIM కార్పోరేటర్‌లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.

News February 16, 2026

NZB: డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్?

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా మహిళనే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇందు కోసం MIM నుంచి 54వ డివిజన్ కార్పోరేటర్‌గా ఎన్నికైన సల్మా తహసీన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె భర్త మహ్మద్ షకీల్ అహ్మద్ ఫజిల్ ప్రస్తుతం నిజామాబాద్ MIM టౌన్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. గత పాలక వర్గంలో MIMకు చెందిన ఇద్రీస్ ఖాన్ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.

News February 15, 2026

NZB: ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నూతన కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతున్న నేపథ్యంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

News February 15, 2026

NZB: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.