India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ నగరంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందన ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభూగా భావిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. రథసప్తమి రోజున సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.

ఆర్మూర్ పట్టణానికి తలమానికం నవనాథ సిద్ధులగుట్ట. వందల ఏళ్ల క్రితం నవనాథులు ఇక్కడి గుహల్లో సిద్ధేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో దీనికి ‘సిద్ధులగుట్ట’ అని పేరు వచ్చింది. తొమ్మిది మంది సిద్ధులలో ముగ్గురు ఇక్కడే ఉండటంతో, నవనాథపురం కాస్తా ‘ఆరు.. మూడు..’ అంటూ కాలక్రమేణా ఆర్మూర్‌గా మారింది. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధమైన రాళ్లతో వెలిసిన ఈ క్షేత్రం నేడు ఆధ్యాత్మిక ల్యాండ్‌మార్క్‌గా విరాజిల్లుతోంది.

ఈ నెల 16న (సోమవారం) నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. NZB ACP ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కాగా మొదట మేయర్ ఎన్నిక జరుగుతుంది. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది.

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

NZB నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇందు కోసం MP, MLA, MLCలు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. దీంతో BJPకి చెందిన MP, NZB(U), ARMR MLAలతో పాటు ఇద్దరు MLCలు, కాంగ్రెస్‌కు చెందిన NZB(R), BDN MLAలతో పాటు జిల్లాకు చెందిన MLC మహేశ్ కుమార్ గౌడ్ ఓట్లు నమోదు చేసుకోనున్నారు.

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్‌లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి 2020 ఎన్నికల్లో 28 సీట్లు వచ్చివచ్చాయి. అయితే ప్రస్తుత 2026 ఎన్నికల్లో కూడా 28 సీటు రావడం గమనార్హం. గత ఎన్నికల్లో 28 సీట్లతో కార్పొరేషన్‌లో లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 12 సీట్లు గెలిచిన BRS 18 మంది MIM, ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ కార్పోరేటర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో?
Sorry, no posts matched your criteria.