Nizamabad

News February 13, 2026

భీంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు: TPCCచీఫ్

image

భీంగల్ మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విజయం ప్రజల ఆశయాల గెలుపు అని పేర్కొంటూ భీంగల్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

News February 13, 2026

భీమ్‌గల్: ​మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం!

image

భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, పట్టణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

News February 13, 2026

భీమ్‌గల్ 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ గెలుపు

image

భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

News February 13, 2026

NZB: కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

image

నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు.

News February 13, 2026

NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

image

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్: ప్రకటనలకే పరిమితం.. నిధుల్లేక రైతుల్లో ఆందోళన

image

కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ కేఆర్. సురేశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వ్యవసాయ రంగానికి బోర్డులు ప్రకటిస్తూనే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదన్నారు. బిహార్ మఖానా బోర్డుకు రూ.100 కోట్లు ప్రకటించి ఖర్చు చేయలేదని, నిజామాబాద్ పసుపు బోర్డుకు కేటాయింపులు లేకపోవడం ఉదాహరణలని పేర్కొన్నారు. ఇలా స్పష్టమైన నిధులు లేకపోతే రైతుల్లో విశ్వాసం తగ్గుతుందన్నారు.

News February 12, 2026

NZB: శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలి: డీసీపీ

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలు, రాజకీయ నాయకులు శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలని NZB అడిషనల్ DCP బస్వారెడ్డి కోరారు. గురువారం పోలీస్ అధికారులకు, సిబ్బందికి సమావేశం నిర్వహించారు. డీసీపీ బస్వారెడ్డి వారికి విధుల పట్ల దిశా నిర్దేశం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ ర్యాలీలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని సూచించారు.

News February 12, 2026

NZB: ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

image

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు.