India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి NZB జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ నవంబర్ 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 24,187 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ DSP విధులకు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో పట్టభద్రుల MLC అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుసగా 12 PSలకు ఆయన SHOగా విధులు నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) NVదుర్గా ప్రసాద్ హైదరాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డైట్ కళాశాల లెక్చరర్ పి.అశోక్ ను నియమించారు.
తెలంగాణ అధికార పర్యటనలో భాగంగా ఈ నెల 5,6,7 తేదీల్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో పాల్గొనేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెళ్లారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వారి పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు.
సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేధించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను వెల్లడించారు. గంగాధర్ అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కృష్ణ వద్ద నుంచి గంగాధర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పును ఇవ్వొద్దనే దురుద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు.
మండలంలోని నల్లమడుగు గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు కొండా సంజీవ్, శ్యామల స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్లుగా ఒకేసారి ఎంపికయ్యారు. ఇద్దరూ బీబీపేట్ మండలంలోని పలు పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తమను ప్రోత్సహించి సహకరించిన వారికి వారిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఒకేసారి ఉద్యోగాలు సాధించిన వారిని గ్రామస్థులు అభినందించారు.
సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు జిల్లా మీ సేవ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు.
మాదిగలు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొన్నారు. వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లు గట్టు మీద పెట్టేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడన్నారు. రైతులకు రుణమాఫీ, బోనస్, కళ్యాణ లక్ష్మితోపాటు బంగారాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. . హైదరాబాద్‌కు చెందిన కొందరు ఆదివారం మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో ఇద్దరు యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగగా.. నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి యువకుల మృతదేహలు లభ్యమయ్యాయి.
Sorry, no posts matched your criteria.