Nizamabad

News October 27, 2024

హెచ్‌సీఎల్ అవార్డు అందుకున్న జుక్కల్ వాసి

image

భారత్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో భాగంగానే అనేక శిఖరాల ఎత్తుకు ఎదిగి దేశానికి అందించిన సేవలను గుర్తించిన హెచ్‌సీఎల్ అవార్డుకు జుక్కల్ వాసి ఎన్నికయ్యారు. మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన ఉమాకాంత్‌కు శనివారం బెంగళూరులోని హెచ్‌సీఎల్ ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల గ్రామస్థులు, జుక్కల్ మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News October 27, 2024

పిట్లం: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా..పిట్లం మండల కేంద్రానికి చెందిన బక్కరాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అయన తల్లి మృతి చెందింది. దీంతో మనస్తాపం చెంది, ఒంటరితనం భరించలేక ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిపారు.

News October 26, 2024

ఎడపల్లి: పెద్ద చెరువులో పడి మృతి చెందిన మహిళ

image

ఎడపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగమణి (56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి కనబడకుండా పోయింది. శనివారం ఉదయం గ్రామ చెరువులో మహిళ శవం తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ శవాన్ని బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2024

NZB: కల్లు బట్టీ వద్ద మహిళ మృతదేహం 

image

నిజామాబాద్ వీక్లీ మార్కెట్ (అంగడిబజార్) కల్లు బట్టి వద్ద ఓ మహిళ మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలి వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు ఉంటుందని ఎవరైనా గుర్తు పడితే నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లేదా 8712659837కు సమాచారం అందించాలని SHO రఘుపతి కోరారు.

News October 26, 2024

బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈనెల 29న నిజామాబాద్ రానున్నారు. బీసీ కమిషన్ పర్యటనను పురస్కరించుకొని శనివారం ఐడిఓసిలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

News October 26, 2024

ఇంటర్న్ షిప్ సాధించిన విద్యార్థులను అభినందించిన వీసీ యాదగిరిరావు.

image

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ జువాలజీ విభాగం మొదటి బ్యాచ్ ముగ్గురు విద్యార్థులు హాల్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఇంటర్నెట్ షిప్ సాధించిన డి. సరిత ఎం.అవినాష్, అజయ్ గౌడ్‌ను వీసీ యాదగిరిరావు అభినందించారు. విద్యార్థులు ఆర్డర్ కాపీలను వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ మాట్లాడుతూ.. మిగతా విభాగాల విద్యార్థులు ఇలాగే అవకాశాలు అందుకోవాలని పిలుపునిచ్చారు.

News October 26, 2024

నందిపేట్: ప్రమాదవశాత్తు గోదావరిలో పడి వృద్ధుడు మృతి

image

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి ఆలూరు మండలానికి చెందిన వృద్ధుడు కండేల నరసయ్య (70) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నందిపేట్ మండలంలోని ఉమ్మేడ పంచముఖి హనుమాన్ మందిరం బ్రిడ్జి దగ్గర ప్రమాదవశాత్తు నరసయ్య గోదావరిలో పడి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ హరిబాబు తెలిపారు.

News October 26, 2024

త్వరలో DSPగా ట్రైనింగ్ తీసుకుంటా: నిఖత్ జరీన్

image

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్. తనకు మద్దతుగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ‘డీఎస్పీ శిక్షణకు సంబంధించి ప్రస్తుతం బ్యాచులు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక వేళ ప్రారంభమైతే శిక్షణలో చేరుతానన్నారు. ఇటు పోలీసు శిక్షణతో పాటు, అటు బాక్సింగ్ ట్రైనింగ్‌ను కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

News October 26, 2024

నిజామాబాద్: హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, తాడ్వాయి తదితర మండలాల్లో నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాల పైన దాడులు నిరసిస్తూ బంద్ కార్యక్రమానికి పాఠశాలలు, వ్యాపారస్తులు కార్యాలయాలు, వర్తకులు ఇతర సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News October 26, 2024

నిజామాబాద్: మోసం చేస్తున్న మహిళలు

image

ఇద్దరూ మహిళలు నమ్మించి మోసం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి నరదిష్టి ఉంది అంటూ నగదు స్వాహా చేస్తున్నారు. వీరి మీద హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.