India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నస్రుల్లాబాద్ మండలంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని స్వాతి(18) మృతి చెందింది. కాగా స్వాతి ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. బాన్సువాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజలి (12) జ్వరం, వాంతులతో మృతి చెందింది. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని (15) ఉరేసుకుంది.
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసిఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే అన్నారు. కేసీఆర్‌ను డెకాయిట్ అనడం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భారీ వర్షానికి ఇంటి వెనుక ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఇంటిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాగా ఇంట్లో ఉన్న డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) కరెంట్ షాక్‌తో మృతిచెందింది. తీగలు తెగి పడడంతో రేకుల ఇంటికి కరెంట్ పాసైంది. స్వాతి.. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా తడిసి ముద్దైంది. వర్షం ధాటికి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దేల్‌చెరువు- బాన్సువాడ ప్రధాన రహదారిపై ఓ భారీ వృక్షం విరిగి నేలకొరిగింది. బాన్సువాడ నుంచి పిట్లం, బిచ్కుంద మండలాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT
బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ టూ టౌన్ ఎస్సై యాసిర్ ఆరాఫత్ తెలిపారు. హైమద్ పుర కాలనీకి చెందిన ఓ పదేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిరాణా షాపునకు వెళ్లి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన భాసిత్ (50) అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్‌లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టగా ఉరివేసుకొని కనిపించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సైలు సాయన్న, కృష్ణకుమార్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోంకన్ పల్లికి చెందిన ఓ వివాహిత(27) బాసర గోదావరి నదిలో దూకడానికి యత్నించింది. అక్కడే ఉన్న గంగపుత్రులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్ఐ లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్ వినాయక్, బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ఆమెను ఠాణాకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.