India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన శ్రీనివాస్(27), సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.
నేడు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా నిజామాబాద్‌లో మాంసం విక్రయాలు నిర్వహించవద్దని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని చేపలు, మేకల మాంసం విక్రయాలు, చికెన్ సెంటర్లు, ఇతర మాంసాహార దుకాణాల నిర్వాహకులు ఈ విషయం గమనించాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ ఉత్తర్వును తూ.చా తప్పక పాటించాలన్నారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఎవరూ రావొద్దని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న వ్యక్తి ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్‌కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందిని హోటల్‌కి పంపించాడు. ఆహారంలో బొద్దింక ఉందని వారు నిర్ధారించడంతో ఆయన హోటల్ యాజమాన్యానికి నోటీస్‌తో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. శనివారం రాత్రి 29,443 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం ఉదయం 10 గంటలకు 31,202 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 3,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వాటిలో కాకతీయ కెనాల్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను ప్రస్తుతం 53.620 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి నుండి మరింత బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాలలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి ఖచ్చితంగా 200 సభ్యత్వం చేయాలని సూచించారు.
* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని వారు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరికి గురైనట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.