Telangana

News September 15, 2024

NZB: నేటి నుంచి మద్యం అమ్మకాలు బంద్

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే బార్లు, క్లబ్లు మూసేయాలన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News September 15, 2024

NLG: వినాయక మండపంలో విషాదం

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 15, 2024

కాసిపేట: విద్యార్థులతో నిద్రించిన జిల్లా కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కాసిపేట మండలం మలకపల్లిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు, విద్యార్థులు నిద్రించే గదులు, వంటశాల, రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రించారు.

News September 15, 2024

వరంగల్: నిమజ్జనం కోసం చెరువులో పూడిక తీసివేత

image

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చెరువుల్లో గణేశ్ నిమజ్జనం కోసం పూడికతీత పనులను చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో భారీ జేసీబీలతో హసన్పర్తి, కాజీపేట బంధం చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, దేశాయిపేట, గొర్రెకుంట, చిన్న వడ్డేపల్లి, ఖలా వరంగల్ గుండు చెరువు, రంగ సముద్రం రంగశాయిపేట బెస్తం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించారు.

News September 15, 2024

నల్గొండ: 11 ఏళ్ల తర్వాత ట్రాన్స్‌ఫర్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లు ఎట్టకేలకు ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 33 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. NLGలోని 17 మోడల్ స్కూళ్లలో 290 మంది, SRPT జిల్లాలో 9 మోడల్ స్కూళ్లలో 144 మంది, యాదాద్రి BNG జిల్లాలో 7 మోడల్ స్కూల్స్ ఉండగా 126 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 560 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగించింది.

News September 15, 2024

సిద్దిపేట: నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు

image

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఈనెల 30 వరకు పోలీస్ కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట CP అనురాధ తెలిపారు. జిల్లాలోని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించకూడదని అన్నారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు.

News September 15, 2024

జగిత్యాల: విష జ్వరాలు తగ్గాలని గణపతి హోమం

image

విష జ్వరాలు తగ్గాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో భరత్‌నగర్ యువసేన ఆధ్వర్యంలో శనివారం గణపతి హోమం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి గ్రామంలో విష జ్వరాలతో పాటు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మహిళలు లక్ష్మీ పూజ, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అనంతరం సామూహికంగా అన్నదానం నిర్వహించారు.

News September 15, 2024

ఆ గ్రామాలకు ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం భట్టి

image

సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు మధిరలోని సిరిపురం సహా మరో 20 గ్రామాల్లోని వ్యవసాయ పంపుసెట్లు, గ్రామాల్లోని ఇళ్లకు సంపూర్ణంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సిరిపురం ఎంపిక కావడంతో గ్రామానికి అరుదైన అవకాశం దక్కినట్లైంది.

News September 15, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 700.125 అడగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2,111 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.

News September 15, 2024

భీంగల్‌: నేడు మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం

image

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నేడు తెలంగాణ ప్రభుత్వ నూతన పీసీసీ అధ్యక్షుడిగా భీంగల్‌కు చెందిన బొమ్మ మహేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరి నేడు ఉన్నత పదవీ(పీసీసీ) చేపట్టడం చాలా గొప్ప విషయం అని పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నారు.