Telangana

News April 5, 2025

MDK: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ VRO/ VRAలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16 లోపు గూగుల్ ఫామ్ (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7) నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయంగా సంతకం చేసిన కాపీని కలెక్టర్ కార్యాలయం(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో సమర్పించాలని అన్నారు.

News April 5, 2025

జడ్చర్ల MLAపై అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట చెరువులో ఉన్న 4 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అతడి సోదరుడు దుష్యంత్ రెడ్డి కబ్జా చేశారని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ మేరకు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జడ్చర్ల PSలో సీఐ కమలాకర్‌కు ఫిర్యాదు చేశారు. 

News April 5, 2025

మహబూబ్‌నగర్: ‘CM రేవంత్ రెడ్డికి THANKS’

image

DSC-2008 అభ్యర్థుల 15 సంవత్సరాల నిరీక్షణను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని DSC-2008 అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు మాలతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసినందుకు పాలాభిషేకం చేశారు. అనేక సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు సీఎం న్యాయం చేశారన్నారు. MBNR జిల్లా గండీడ్ మండల ఉపాధ్యాయులు ఉన్నారు.

News April 5, 2025

ADB: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: DSP

image

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.

News April 5, 2025

ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

News April 5, 2025

NZB: కత్తి దాడి.. ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. నగరంలోని ఆరో టౌన్ పరిధిలో అక్బర్ కాలనీ కెనాల్ కట్టలో ఇటీవల కత్తి పోట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు.

News April 5, 2025

HYDలో దర్శనానికి సాయిబాబా నాణేలు

image

లక్ష్మీ భాయి షిండేకు షిర్డీ సాయిబాబా స్వయంగా అందించిన దైవికమైన 9 సాయి నాణేలు చాదర్‌ఘాట్‌ సాయిబాబా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న ఉ.11 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ నాణేలు ప్రదర్శించనున్నట్లు సాయిబాబా ఆలయ అధికారులు తెలిపారు. ఈ అరుదైన పుణ్యదర్శనాన్ని భక్తులు తప్పక వినియోగించుకోవలసిందిగా వారు కోరారు.

News April 5, 2025

రోగుల సేవలో నర్సుల పాత్ర కీలకం: కరీంనగర్ కలెక్టర్

image

ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదవబోతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం గణేశ్ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర ముఖ్యమైందని, మానవతా దృక్పథంతో వారు సేవలందించాలని సూచించారు.

News April 5, 2025

మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి

image

ఖమ్మం: మత్స్యకారులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో గిరిజన మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

News April 5, 2025

NZB: ప్రకృతి విధ్వంసంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆవేదన

image

గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసంపై బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని, చెట్లను నరికేసే ప్రకృతితో యుద్ధం చేస్తూ పర్యావరణ హననానికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని, ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను నరికేసిన పరిపాలన సాగుతున్నదన్నారు.