Telangana

News April 4, 2025

ఖమ్మం జిల్లాలో TODAY ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో 6నెలల జైలు శిక్ష.. ∆} ఖమ్మం: సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం: బీజేపీ ∆} HCU భూములపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి ∆} కామేపల్లి: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్ ∆} ఖమ్మంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర ∆} ఖమ్మం: సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి: తుమ్మల ∆}KMM: తలతాకట్టు పెట్టెనా పథకాలు అమలు చేస్తాం: పొంగులేటి.

News April 3, 2025

HYD: భారీ వర్షం.. ప్రజలకు జలమండలి ఎండీ సూచనలు

image

భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

News April 3, 2025

కార్యదర్శుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం

image

మెదక్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం(TPSF) గ్రామ కార్యదర్శులకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని జేపీఎస్, ఓపిఎస్ సెక్రటరీల పెండింగ్ వేతనాలు, గ్రామ పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు సహా పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, టీపీఎస్ఎఫ్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2025

ఢిల్లీలో మూడో రోజు బీసీ రిలే నిరాహార దీక్షలు

image

బీసీలకు 42% రిజర్వేషన్ విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘ఓబిసి ఆజాదీ సత్యాగ్రహ్’ దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలోని పలువురు నాయకులు దీక్షలోని నాయకులను పరామర్శించి మద్దతు ఇచ్చినట్లు బీసీ నాయకులు గంగాధర్ తెలిపారు. పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించాలని డిమాండ్ చేశారు.

News April 3, 2025

HYD: అప్రమత్తంగా విద్యుత్‌శాఖ సిబ్బంది

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారు. వెంట వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్: ‘దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు కొమురయ్య’

image

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

News April 3, 2025

మహబూబ్‌నగర్: BRS వాళ్లకు కాంగ్రెస్ నేత WARNING

image

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై BRS నాయకులు బురదజల్లే చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ హెచ్చరించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ఎన్నో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, అక్కడ మాజీ మంత్రి కూర్చోకుండా తనకు కుర్చీ వేయలేదంటూ అనవసర రాద్ధాంతం చేశారన్నారు.

News April 3, 2025

GHMC అప్రమత్తంగా ఉంది: మంత్రి పొన్నం

image

హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు.

News April 3, 2025

వరంగల్: 4 బార్ల లైసెన్స్‌లకు దరఖాస్తు

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 బార్లకు సంబంధించి మళ్లీ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అర్హులు, ఆసక్తి గలవారు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 29న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.

News April 3, 2025

SC, ST అట్రాసిటీ కేసులు 30లోగా పరిష్కరించాలి: బక్కి వెంకటయ్య

image

వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న SC, STఅట్రాసిటీ కేసులను ఈనెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.