India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫుడ్ పాయిజన్‌కు గురై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదని ధైర్యం చెప్పారు. విద్యార్థులకు సరైన ఆహారం, వైద్యం అందించాల్సిందిగా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
మద్నూర్ AMC ఛైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై CM రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ మహిళల చదువుకు ఆత్మస్థైర్యానికి ప్రోత్సహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని’ సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన MLA తోట లక్ష్మీకాంత్ రావు, సహచర మంత్రి వెంకటరెడ్డి, TPCC చీఫ్ మహేశ్ గౌడ్లకు అభినందనలు తెలిపారు.
ఓ బాలికపై(17) మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసుల వివరాలిలా.. ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన బాలికపై మేనమామ కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవ్వరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు DSP పేర్కొన్నారు.
జైనూర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరు చెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. బుధవారం గ్రామస్థులతో జరిపిన పరిశీలనలో ఈ విషయం బయటపడింది. సర్వే సాకుతో స్కూల్‌కు ఉపాధ్యాయులు గైర్హాజరవుతున్నరని చెప్పారు. జైనూర్ మండలంలోని గౌరీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఉర్దూ) ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో 17 డిగ్రీలు, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కులగణన సర్వేపై అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
☆ ఖమ్మం నగరంలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన
☆ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం, భద్రాద్రిలో నేడు ప్రత్యేక పూజలు
☆ మధిరలో నేడు విద్యార్ధులకు టాలెంట్ టెస్ట్
☆ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న కులగణన సర్వే
☆ అశ్వారావుపేటలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
☆ పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంసి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఓ వివాహిత కలిసి లాడ్జికి వచ్చారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడు రూంలో ఉరేసుకున్నట్లు తెలిపారు. మహిళ సమాచారం మేరకు సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సీఐ కరుణాకర్ తమకెలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.
కృష్ణ మండలం పరిధిలోని తంగిడి కుంటలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి వీరేష్ వెళ్తుండగా మొసలి కనిపించిందని తెలిపారు. మొసలి ఉన్నట్లు గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అటువైపు వెళ్ళవద్దని మత్స్యకారులు, పశువుల కాపరులు కుంటలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మహిళను వేధిస్తున్న ఒకరిని షీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఓ మహిళ ఫోన్‌కి ఒక వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ, అసభ్యకర సందేశాలను పంపుతూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ షీటీంకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఆర్మూర్ షీటీం సభ్యులు అతడిని పట్టుకున్నారు. తదుపరి చర్యలకై అతడిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Sorry, no posts matched your criteria.