Telangana

News March 17, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కాగా, త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.

News March 17, 2024

మెదక్‌: ఆటో‌ డ్రైవర్‌ ఆత్మహత్య

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండముల కిరణ్ (23) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 17, 2024

ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

image

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

News March 17, 2024

NZB: జిల్లాలో భారీగా పంట నష్టం

image

ఉమ్మడి NZB జిల్లాలోని బిక్కనూరు, కామారెడ్డి, వర్నిలోని సిద్దాపూర్, కుసల్ దాస్ తండా, పైడిమాల, గుంటూరు క్యాంప్, చింతల్ పెట్ తండాతో పాటు పలు గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్క జొన్న, జొన్న పంటలు నెలకొరిగాయి. వేల ఎకరాల్లో పంటనష్టపోయామని రైతులు వాపోతున్నారు. మండలాల్లోని వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News March 17, 2024

మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలోని ఓటర్లు

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ మహబూబ్‌నగర్ అసెంబ్లీలో – 2,58,658
✓ జడ్చర్ల అసెంబ్లీలో- 2,23,222
✓ దేవరకద్ర అసెంబ్లీలో – 2,39,077
✓ నారాయణపేట అసెంబ్లీ – 2,35,517
✓ మక్తల్ అసెంబ్లీ – 2,43,338
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,42,267
✓ షాద్‌నగర్ అసెంబ్లీలో – 2,38,338 మంది ఉన్నారు

News March 17, 2024

KMM: సెల్ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..!!

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.

News March 17, 2024

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్

image

ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 17, 2024

నల్గొండ: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా..?

image

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ అమలుతో పలు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దులు తగిన చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

News March 17, 2024

ఉమ్మడి పాలమూరు నుంచి ముగ్గురికి కార్పొరేషన్ పదవులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది. కొల్లాపూర్ జగదీశ్వరరావుకు స్టేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ పదవి వచ్చింది.

News March 17, 2024

5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. కానీ ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాలులోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.