Telangana

News March 18, 2024

KMM: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట ఖానాపురం హవేలి పోలీసులను ఆదివారం ఆశ్రయించింది. నగరంలోని మామిళ్లగూడెం, శ్రీనగరాకాలనీ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. దీనికి యువతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మేజర్లైన తాము ఇరువురం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు.

News March 18, 2024

నిజామాబాద్: కన్నతల్లి పై కొడుకు కర్కశత్వం

image

నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.

News March 18, 2024

MBNR: PUలో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలు

image

పీయూ ప్రాంగణంలో కొత్తగా న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. న్యాయ కళాశాలలో మూడేళ్ల పాటు 60 సీట్లు, LLMలో 20 సీట్లు, ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తో పాటు నాలుగు కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలలు నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 18, 2024

నల్లగొండ: విద్యార్థులు ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి

image

నేటి నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. వ్యాలిడిటీ కలిగిన బస్సు పాస్ ఉండి రూట్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్ పై ఉన్న పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కాంబినేషన్ టికెటుతో ఎక్ ప్రెస్ బస్సులోనూ ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

News March 18, 2024

వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ హరిచందన

image

టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్‌, ప్రింటర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2024

GHMCలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 18, 2024

GHMCలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 18, 2024

మేడారం: జంపన్నవాగులో మునిగి ఒకరి మృతి

image

వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన రాజు కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆదివారం మేడారం వచ్చారు. పుణ్యస్నానం కోసం ప్రవాహంలోకి దిగారు. లోతును అంచనా వేయకుండా దిగడంతో మునిగిపోయాడు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 18, 2024

HYD: నేటి నుంచి జూన్ 4 వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు

image

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT