Telangana

News March 16, 2024

సంగారెడ్డి: మార్చి 18 నుంచి 144 సెక్షన్

image

ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని SP రూపేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్‌లకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

News March 16, 2024

నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలి: కలెక్టర్

image

ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన కలెక్టరేట్లో వివిధ విభాగాల నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ శాలొం పాల్గొన్నారు.

News March 16, 2024

MBNR : మోడీ సభ సక్సెస్.. బీజేపీ నేతల్లో జోష్

image

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఈరోజు జరిగిన మోదీ విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా.. మోదీ మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మోదీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయకులు, నేతలు పాల్గొన్నారు.

News March 16, 2024

NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

image

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 10వతరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 25 లోపు SBI-RSETI, రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News March 16, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటిస్తూ సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని, కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు పనిచేసేలా 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News March 16, 2024

ప్రధాని మోడీ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ వివరాలు

image

నిజామాబాద్, కోరుట్ల, రాయికల్ నుండి వచ్చే వాహనాలను లింగంపేట రోడ్డు, బీట్ బజార్, మార్కెట్ యార్డులో పార్కింగ్ చేసుకోవాలని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కరీంనగర్ వైపు నుండి వచ్చేవారు మెడికల్ కాలేజీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ధర్మశాల పార్కింగ్ ప్లేస్‌లో, ధర్మపురి, సారంగాపూర్, గొల్లపల్లి వైపు నుండి వచ్చే వాహనాలను పాత బస్టాండ్ వద్ద గల మినీ స్టేడియంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.

News March 16, 2024

మెదక్‌లో విషాదం.. బాలుడి సూసైడ్

image

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొమ్మ మింటూ అనే (16) బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది. శనివారం ఊరి శివారులోని చెరువులో దూకేశాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 16, 2024

మోడీ సభ.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన!

image

ఈనెల 18న జగిత్యాలలో ప్రధాని బహిరంగ సభ సందర్భంగా పట్టణంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనికి ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మధ్య నడిచే వాహనాలు ధరూర్ కెనాల్ బైపాస్ ద్వారా వెళ్లాలన్నారు. ధర్మపురి, కరీంనగర్ మధ్య నడిచే వాహనాలు పొలాస, తిమ్మాపూర్ బైపాస్ మీదుగా వెళ్లాలన్నరు .

News March 16, 2024

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

image

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ టికెట్ కోసం ముగ్గురు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సాంబయ్య, సీనియర్ నాయకులైన సింగాపురం ఇందిరా, జన్ను పరంజ్యోతి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. 2, 3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

News March 16, 2024

NGKL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.